ది మిషన్ లైఫ్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ రెవ. విల్డో దోస్ అంజోస్ గారి మాటలు (தெலுங்கு)

ది మిషన్ లైఫ్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ రెవ. విల్డో దోస్ అంజోస్ గారి మాటలు
(As palavras do Rev. Windo dos Anjos, Missao Vida)

నా పదమూడు సంవత్సరముల వయస్సులో, ఒక పరిశ్రమలో పని చేయుటకు వెళ్ళుచుండగా ఇదంతయు ఆరంభామాయెను. నేను వీధులలో నిద్రించుచున్న అనేకమంది భిక్షగాళ్ళను చూచితిని. వారు జీవిoచిన విధానము
నన్ను చలించి వేసిoది. ఒక శనివారపు ఉదయము, వారిలో ఒకరిని కలవాలని నిశ్చయించుకొని, జాన్ అనే వ్యక్తిని కలిసి కొన్ని నిమిషములు గడిపితిని. ఆ దినము నుండి నేను వారి కొరకు ఉదయకాలము టిఫిన్ తీసుకోని వెళ్ళడం ఆరంభించితిని.

మరియు వారిపై నా ప్రేమ మరియు వాత్సల్యము క్రమక్రమముగా పెరుగుచూ వచ్చెను. ఒక ఉదయము, నేను జాన్ కు దగ్గరగా చేరి అనేక మార్లు అతనిని తాకితిని. అతని దగ్గర నుండి ఎటువంటి సమాధానము రాలేదు. ఆ కొరుకుడి చలిగల రాత్రి జాన్ మరణించాడు.
కొన్ని సంవత్సరముల తరువాత, యేసును నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. తరువాత, దేవుడు నా
హృదయమును కదిలింపసాగాడు. మరియు ఆయన నాకు గ్రహింపచేసిన విషయము ఏమనగా, జాన్ లాంటి వ్యక్తులను ఆయన ఎంతో ప్రేమించుచున్నాడు కాని సమాజము అట్టివారిని చిన్న చూపు చూసెను. ఈ పరిస్థితి నన్నెంతో భాదించింది.
ఒక శనివారపు రాత్రి చర్చికు ప్రయాణము చేస్తున్నప్పుడు, ఫుట్‌పాత్‌పై ఇద్దరు మనుష్యులు నిద్రిస్తున్నట్లు చూశాను. అప్పుడు నేను వారికి ఆశ్రయము కొరకు ప్రార్ధించడము మొదలు పెట్టాను మరియు నేను వారిని బట్టి ఎంతో తీవ్రత కలిగి,
“తండ్రీ, ఈ వ్యక్తులను నీవు ఎంతో ఉన్నతముగా ప్రేమిస్తే, వారికి సహాయము చేయుటకు మరియు రక్షించుటకు నన్ను ఎందుకు ఉపయోగించుకొనవు? అని ప్రార్ధన చేసాను. కొన్ని సంవత్సరముల తరువాత, వీధులలో సువార్త చెప్పటము ఆరంభించితిని. అంతయు సాఫీగా జరుగుతున్న సమయములో ఒక భిక్షగాడు, నా దగ్గరకు వచ్చి, ఒకవేళ దేవుడు నన్ను ఎంతో గొప్పగా ప్రేమిస్తే, నాకు అది ఎందుకు ఋజువు పరచవు? నేను ఆకలితో మరియు చలితో భాదపడుచున్నాను, వాస్తవానికి ఈ జీవితము ముగించుటకు నాకు సహాయము కావాలి అని నాతో అన్నాడు. ఆ విషయము నన్ను ఆలోచింపచేసినది మరియు దాని నిమిత్తము ప్రార్ధన చేసాను. దేవుని ప్రేమను సరైన విధముగా వారికి వ్యక్తపరచుటకు దేవుని సహాయము కోరి, అంచలంచలుగా వారికి ఆహారము, దుప్పట్లు, తమ స్వంత ఊర్లకు తిరిగి వెళ్ళుటకు బస్సు
టికెట్లు అందించి యేసు ప్రేమను వారికి భోదించితిని. నేను ప్రార్ధించి సువార్తను అందించగా ఇద్దరు రక్షించబడ్డారు, నాకు అదెంతో ఆనందమును కలుగచేసినది.
ఒక చిన్న కార్యము ద్వారా, ఒక పెద్ద మిషన్ కు పురుడు పోసే విధముగా మిషన్ లైఫ్, ఒక మానవ శాస్త్ర సంస్థ అన్ని దేశముల సరిహద్దులలో,విదేశములలో మరియు దేవుని హృదయంలో బాగా ప్రసిద్ది చెందుతుందని నేనన్నడూ ఊహించలేదు.
ఈ మనుష్యులకు వీలైనంత సహయాము చేయుటకు ప్రయత్నించితిని కాని ఇట్టి మనుష్యులు వందలాదిగా వీధులలో నివసిస్తున్నారని తెలుసుకొని నేనెంతో కలవరపడ్డాను. బ్రెజిల్ దేశములో ఏ సంస్థ ఇట్టి వారిని పునరుద్దరించుటకు
మరియు తిరిగి కోలుకోవటానికి సహాయము చేయుటకు సిద్దముగా వున్నవని గుర్తించుటకు ప్రయత్నించితిని. వారి జీవితంలో అలాంటి అంతర్భాగం చేయగల సంస్థను నేను కనుగొనలేదు.
అనేకులు నన్ను “బిక్షకుల రాజు” అని పిలిచారు మరికొందరు “అనాపోలిస్ యొక్క పిచ్చోడు” అని కూడా పిలిచారు, కాని దేవుడు నన్ను బ్రెజిల్ దేశములో మొట్ట మొదటి బిక్షకుల సువార్తికునిగా నన్ను చేసాడు. నేను అనేక శ్రమలను ఎదుర్కొన్నప్పటికీ, 20 సంవత్సరములుగా సవాళ్ళ మధ్య కార్యమును జరిగించితిని.

ఈ మనుష్యులు రాత్రి సమయములో నిద్రించుటకు కొన్ని గదులను అద్దెకు తీసుకొంటిని. నా జీతమంతయు తీసుకోని 8 గదుల అద్దె కొరకును మరియు వారికి ఆహారమిచ్చుటకు ఉపయోగించితిని. అది నాకు సులభము కాదు కాని దేవుడు నాకు ఒక పరిష్కారమును ఇచ్చెను. పాత బిక్షగాడు చెప్పిన మాటలు, “ మేమందరమూ కలసి ఉండుటకు ఒక వసతిని నీవు ఎందుకు ఏర్పాటు చేయకూడదు? నీవు ధనమును దాచి అనేకుల భిక్షకులకు యేసును పరిచయము చేయవచ్చు” అన్న మాటలు నాకు జ్ఞాపకము వచ్చినవి.
ఈ పరిస్థితిని బట్టి మేము ప్రార్ధన చేయగా దేవుడు ఒక చిన్న స్థలమును దానముగా ఇచ్చుట ద్వారా మాకు జవాబును ఇచ్చాడు.
మేము అనేక వారములు ప్రార్దిస్తూనే వచ్చాము.
కాని కట్టుటకు మా దగ్గర కాలవసినంత ధనము లేదు. మేము ప్రార్ధిస్తూ ఉండగా, నేను ఇప్పటికే కట్టుటకు సరిపడు సహాయము పంపించానని దేవుడు నాతో చెప్పాడు.
దేవుడు నాకు పంపించిన ధనము ఎక్కడ ఉన్నది?
అప్పుడు నేను ఆలోచిస్తూ ఉండగా నేను కారు కొనుటకు దాచుకొన్న కొంత ధనము నాకు జ్ఞాపకము వచ్చినది.
ఆ ధనముతో బ్రెజిల్ దేశములోని భిక్షకులకు పునరుద్దరణ కేంద్రమును కట్టుటకు కొంతమంది పనివారిని ఏర్పరచుకొంటిని..
కొన్ని నెలల తరువాత అనేక మంది వాలంటీర్లు మరియు ప్రజలు స్వచ్చందముగా ఈ పని కొరకు సహాయము చేయుటకు వచ్చిరి మరియు దేవుడు అనేక ద్వారములు తెరిచెన.

ఇపుడు నేను వ్రాస్తూ ఉండగా, అనేక ఆలోచనలు మరియు ప్రశ్నలు నా మనసునకు వచ్చెను, అవేవనగా కొంతమంది దేవునిని ఈలాగున అడుగుదురు, అంత శక్తిగల దేవుడు ఎందుకు అంత చిన్న కార్యములను చేస్తాడు?
ఏలియా దేవుడు, అబ్రహాము దేవుడు మరియు అద్భుతములు చేయు దేవుడు ఎక్కడ ఉన్నాడు?
బదులుగా, ప్రశ్న మరొక రకముగా ఉండాలి, దేవుని ఏలియాలు ఎక్కడ ఉన్నారు? దైవజనులు ఎక్కడ వున్నారు? మరియు నా సమర్పణ ద్వారా దేవుని గురించిన సాక్ష్యమును చెప్పుతూనే వున్నాను.
నేడు దాని కారణముగా మిషన్ లైఫ్ బ్రెజిల్ దేశమoతా మరియు ప్రపంచమంతా వ్యాపించింది.

నేడు మేము దేశములోని అయిదు ప్రాంతములలో, 9 రాష్ట్రములలో మరియు 15 పట్టణములలో 14 యూనిట్ల పునరుద్దరణ మరియు పునరావాస కేంద్రములు కలిగియున్నాము. అనాపోలిస్ మరియు కకాల్జిన్హో/GO, బ్రసీలియా/DF, ఉబెర్లన్డియా మరియు గోవేర్నదోర్ వలదరెస్/MG, కమకారి మరియు లూయిజ్ ఎద్యురాడో మగల్హేస్/BA, డాక్యు డి కైక్సాస్, లోన్డ్రీనా ఏ రోలాందియా /PR, మనువాస్/AM, ప్రిన్సేస ఇసాబెల్ /PB, సోం జోస్ దో రియో ప్రేతో మరియు గువపియాకు /SP మరియు,
కరుఅరు / పిఇ

మేము ఇప్పటి వరకు దేవుని కృప వలననే ఎదిగియున్నాము. మరియు ఇతర పరిచర్యల సహాయము ద్వారా అనగా విద్యా సహాయము, పిల్లలకు మానసిక మరియు ఆధ్యాత్మిక సహాయము మరియు యుక్త వయసులోని వారికి
ప్రమాదకర పరిస్థితులలో అనాపోలిస్, జోవాం పెస్సోవా మరియు ఆఫ్రికాలోని మడగాస్క విద్యా సంస్థల ద్వారా సహాయము చేసితిమి. పెద్ద వారిలో తక్కువ ఆధాయముతో ఇబ్బంది పడుతున్న వారికి వ్రుత్తి సాంకేతికలు ఏర్పరచుకొనుటకు సహకారము అందించితిమి.
మరియు మేము విదా (MISSION LIFE) సెమినరి ద్వారా పట్టణ మిషనరీ పరిచర్య కొరకు రెవ. పాలో బ్రోన్జెలి ద్వారా ప్రజలను సిద్దపరచుదుము.
లైఫ్ క్లినిక్ ద్వారా సమాజములో అవసరమైన వారికి వైద్య సహకారము, దంతముల వైద్యము, మానసిక
మరియు సాంఘిక సహకారము అందించితిమి.
సమర్పణ కలిగి పరిచర్య చేసి పదవీ విరమణ పొందిన సేవకులు ఈ గ్రామమునకు గౌరవముగా వచ్చి వారి పనిని కొనసాగించవచ్చును , ప్రార్ధనా పరిచర్యను టెర్రా నోవా లోని సర్వీస్ హాలు నందు, పార్క్ అఫ్ ఫ్రెండ్స్, ఫెయిత్ మెమరీ, క్యాంపు లైఫ్ మరియు హోటల్ లైఫ్ లో కొనసాగవచ్చును. వెయిటర్ల కొరకు, హోటల్ నైపుణ్య సిబ్బంది మరియు ఇతర సామాజిక కార్యములు నిధుల సేఖరణ కొరకు స్కూలు ఏర్పాటు చేయబడినది.

నేడు మిషన్ లైఫ్ లో ప్రతి దినము 1500 మoది హాజరగుటకు సామర్ధ్యము కలదు మరియు మాకు అప్పగించిన పని అంతటిలో దేవుడు ఎంతో నమ్మదగిన వానిగా ఉన్నాడు.
మునుపు 12 మందిని మాత్రమె మార్చుటకు ఏర్పడిన కేంద్రము, ఇప్పుడు దేశములో భిక్షకులందరికి ఒక గొప్ప పునరుద్దరణ కేంద్రముగా మారినది.

ఇన్ని సంవత్సరముల మా పరిచర్యలో అనేక అభుభవములు వున్నవని చెప్పుటకు ఎట్టి అనుమానము లేదు.
ఈ కలను నెరవేర్చుటకు షరతులు లేకుండా నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికి నా వందనములు.
ప్రాముఖ్యముగా నాకు నమ్మకమైన స్నేహితునిగా మరియు ప్రభువుగా వున్న నా దేవునికి వందనములు. సమస్త మహిమ, ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక.

మీరు మిషన్ లైఫ్‌లో భాగం కావాలనుకుంటున్నారా?
హాయిగా ఉండే వాతావరణంలో రోజుకి అయిదు సార్లు భోజనం, శుభ్రమైన బట్టలు, పడకలు మరియు దుప్పట్లు.
వృత్తిపరమైన కార్యకలాపాలు, వైద్య మరియు దంత సంరక్షణ.
శారీరక మరియు మానసిక గాయాలు స్వస్థపరచుటకు; వినడానికి మరియు సలహా ఇవ్వడానికి స్నేహపూర్వక సహవాసము;
జీవిత పునఃప్రారంభమునకు ప్రోత్సాహకం మరియు ఆసరా .

వీటన్నిటికీ ధర ఉందా?
మిషన్ లైఫ్ ద్వారా వీధులలో నుండి తీసుకొనబడిన బిక్షగాళ్ళకు చేసే కార్యములకు ఎట్టి రుసుము లేదు మరియు
వారికి ఒక నిశ్చయత ఇచ్చెదము.
అందువలన, ఇవన్నీ చేయుటకు మీ సహాయము మాకు అవసరము. ప్రేమను పంచడంలో మరియు సంఘీభావాన్ని విస్తరింపచేయుటకు మీరు ఈ పరిచర్యలో భాగం కావచ్చు.
ఇది సులభము, వీలైనంత శ్రేష్టముగా సహకరించండి.

దానము చేయుడి:
• బట్టలు, బూట్లు పాతవి లేదా కొత్తవి.
• మందులు
• ఆహారము
• ఆరోగ్య పోషకములు
• క్రమం తప్పని వాలంటీర్లు
• బ్యాంకు ద్వారా, క్రెడిట్ లేక నేరుగా బ్యాంకు డిపాజిట్ ద్వారా ప్రతి నెల సహకారములు
• ప్రాజెక్ట్ కొరకైన ప్రత్యెక విరాళములు
• పాస్టర్లు మరియు మిషనరీలు, పనివారు కొరకు, ప్రాజెక్టులు, గ్రూపులు మరియు సాహాయకుల నిమిత్తము ప్రార్దించుడి.
• మిషన్ లైఫ్ గురించి మరింత సమాచారము కొరకు

పరిపాలనా కార్యాలయం:

Av. Carlos Elias n.º 50, B. São Carlos, Anápolis/GO, CEP: 75084-100
Phone – 62 3318 1985 / 62 3318 2085.
E-mail: mvida@mvida.org.br
Site: www.mvida.org.br
Contributions: Associação Missionária Evangélica Vida / Missão Vida
CNPJ 01.139.179/0001-25
Banco Bradesco: Ag.: 0240-2/ C.C. 55578-9 (para transferência online usar opção Alfanumérico-DP05)
Banco do Brasil: Ag.: 3206-9/ C.C. 27381-3